జగన్‌ పేరుకే రెడ్డి! పైసా జేబులోంచి తీయడు! జేసీ మార్కు సెటైర్లు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కోడి కత్తి గా యం ఓ డ్రామా. కోడికత్తి గాకుండా ఎవడైనా పెద్ద కత్తి తో జగన్‌కు చిన్న గాయం చేసినా మా చంద్రబాబు కొంప మునిగేది. అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదు. అంత తిక్క వ్యక్తి జగన్‌ సీఎం అయితే ఇక అంతే’’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మా వాడు జగన్‌.. పేరుకు రెడ్డే కానీ రెడ్లకుండే దాతృత్వం లేదు. జగన్‌..! ఇప్పుడు కూడా నేను నీ మేలు కోరేవాడినే. నీకు ఇద్దరు కూతుళ్లున్నారు.

<img class=”alignnone size-full wp-image-28902″ src=”http://www.andhravijayam.com/andhra/wp-content/uploads/2018/11/jc-diwakar-reddy5655.jpg” alt=”” width=”910″ height=”607″ />

చక్కగా ఫ్యాక్టరీ లున్నాయ్‌.. లక్షణంగా బతుకు. నేనే ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలనుకుంటున్నా. కానీ చంద్రబాబు మరో పదే ళ్లు.. కనీసం ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటేనే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుంది. వచ్చే ఎన్నికల్లో 30 శాతం అభ్యర్థులను మార్చకపోతే చంద్రబాబుకు అధికారం గోవిందా. ఆయన ముందుచూపు న్న నాయకుడు. సీఎం కావాలనుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు. జగన్‌కు కామన్‌సెన్స్‌ లేదు. పట్టిసీమను చంద్రబాబు తీసుకొస్తే దాన్ని వద్దనేవాడుంటాడా? దశాబ్దాల కిందటే నిపుణులు ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించారు. దాన్ని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. జిల్లాలో నిర్మించిన బీటీపీకి నీరెప్పుడొస్తుందిరా.. అని మా నీలం సంజీవరెడ్డి అనేవాడు. ఆయన కలను ఇప్పుడు నిజం చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా గోదావరి, కృష్ణా నదులను చంద్రబాబు అనుసంధానం చేశాడు’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే సంక నాకిపోయినట్టేనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

<img class=”alignnone size-full wp-image-28903″ src=”http://www.andhravijayam.com/andhra/wp-content/uploads/2018/11/ys-jagan565656.jpeg” alt=”” width=”800″ height=”448″ />

తానూ రైతు బిడ్డనేనని, తనకూ రైతు కష్టాలు తెలుసునని వివరించారు. చెమటోడ్చి కష్టపడడానికి రైతు సిద్ధంగా ఉన్నా.. నీరు లేక నీరసించిపోతున్నారన్నారు. కొడుకు ఉద్యోగమో, మరొకటో చేసినా సాగునీటి ముందు అవేమీ సాటిరావన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చిన ఓపికైన మనిషి పయ్యావుల కేశవ్‌ను వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని నాయకులెవరైనా కోరుకోవాలన్నారు. అలా కాకుండా వైసీపీ అధినేత జగన్‌ కామన్‌సెన్స్‌ కోల్పోయి అప్పట్లో పట్టిసీమ వద్దన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుచూపున్న నాయకుడు చంద్రబాబేనన్నారు. విజన్‌, పట్టుదల, ఏదైనా చేయాలనే తపన ఉన్న నాయకుడు ఆయనేనన్నారు. నదుల అనుసంధానం గురించి దశాబ్దాల కిందటే నిపుణులు చెప్పారని, దాన్ని అమలు చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనన్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు నీరు తేవడం వీళ్లకే సాధ్యమయిందని మంత్రి కాలవ, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరిని ఉద్దేశించి పేర్కొన్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే అనంతపురం చెరువులకు నీరొచ్చే ప్రసక్తే లేదన్నారు. అందుకే ఆయనను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలని కోరారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.