లగడపాటి సర్వేలు సూపర్‌హిట్! ఇదీ ఆయన ట్రాక్ రికార్డు!

మనల్ని ఎవడన్నా కాపీ కొడుతున్నాడు అంటే మనం పెద్ద తోపు అయిపోయినట్టే. ప్రతోడూ నాలుగు అంకెలు రాసేయటం ఇది లగడపాటి రాజగోపాల్‌ సర్వే అనటం మామూలు అయిపోయింది. మొదట్లో రాజగోపాల్‌ ఖండనలు ఇచ్చేవాడు. నేనేం చెయిపియలేదురా బాబో అని. పద్దాకా ప్రతోడూ ఏదోకటి రాస్తుంటే విసుగొచ్చి చావనీయండె హే అని వదిలేసాడు. లగడపాటి సర్వేలు అంత కచ్చితంగా ఎలా వస్తాయి? ఏపీ అయినా యూపీ అయినా ఫలితాలు వినగానే బీపీ రావాల్సిందే ఏం చెప్తారా అనే ఉత్కంఠతో.

ఆర్జీస్‌ ప్లాష్ టీం 2005లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సర్వే చేసింది. తర్వాత 2006లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికపై కూడా ఆర్జీస్‌ ప్లాష్ టీం సర్వే చేసింది. ఫలితాన్ని కరెక్ట్‌గా ఎనలైజ్ చేసింది. అప్పటి నుంచి అందరి నజర్‌ ఆర్జీస్‌ ప్లాష్ టీం పైన పడింది. దేశంలో ఎక్కడైనా ఏ ఎన్నికలు జరిగినా ఆర్జీస్‌ ప్లాష్ టీం రంగంలోకి దిగేది. తన సర్వే బృందాల ద్వారా కచ్చితమైన ఫలితాన్ని ముందుగానే అంచనా వేసేది. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ సర్వే విడుదల చేయడం కామన్‌గా మారింది. మీకు గుర్తుండే ఉంటుంది. రాజగోపాల్‌ 2011లో జరిగిన కడప ఎంపీ ఉప ఎన్నికల్లో జగన్‌ భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పాడు. 2014లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. అందుకే అతని కచ్చితత్వాన్ని చూసే ఆయనను ఆంధ్రా ఆక్టోపస్‌ అని తెలుగు ప్రజలు పేరు పెట్టేశారు.

తర్వాత నంద్యాల, కాకినాడల్లోనూ అక్షరం పొల్లు పోకుండా సర్వే ఫలితాలను వెల్లడించారు. త్వరలో గుజరాత్‌, హిమాచల్‌లోనూ సర్వే చేయబోతున్నారు. ఇలాంటి దిగ్గజం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో, మ్యానిఫేస్టో రూపకల్పనలో, సామాజిక సమీకరణాలను అంచనా వేయటంలో, పొత్తుల విషయంలో టీడీపీని గైడ్ చేయబోతున్నారు. మరోపక్క యూపీలో, నంద్యాలలో ఫ్లాప్‌ అయిన పీకే వైసీపీని గైడ్‌ చేయబోతున్నారు. ఇది రెండు సర్వేల మధ్య పోరాటం ! రెండు ఆలోచనల మధ్య ఫైట్. ఎవరి అంచనా నిజం అవుతుంది ? ఎవరికి తెలుగునాడి అర్థం అవుతుంది ? ఆంధ్రోడి తడాఖా జై కొట్టబోతున్నది ఎవరికి ? కంగుతినబోతున్నది ఎవరు ? రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నాడు అనేది తర్వాత సంగతి గానీ, సర్వేలు, జనాభిప్రాయం, పల్స్ పట్టుకోవడంలో అక్టోపస్ అంతటి మొనగాడు. ఇంచు కూడా అటూఇటూ కాకుండా ఆయన చేసిన సర్వేలు అక్షరాలా నిజమయ్యాయ్ !

Copy Protected by Chetan's WP-Copyprotect.