తోట త్రిమూర్తులను పట్టుకుని అంత మాట అనేశాడా జగన్‌? అందుకే కోపంతో వచ్చి సీఎంను కలిసి టీడీపీలోనే ఉంటాన్నాడా?

తోట త్రిమూర్తులు సోమవారం రాత్రి సీఎం చంద్రబాబును కలిశారు. నేను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది మీరు నమ్మకండి. నేను టీడీపీలోనే ఉంటాను అని చెప్పారు. అయితే దీని వెనుక సమ్‌థింగ్ ఏదో జరిగిందని మీడియా వర్గాలు ఆరా తీశాయి. జగన్‌ భీభత్సమైన షాక్ ఇచ్చాడని, టీడీపీలో ఎంతో గౌరవంగా ఉంటున్న తోట త్రిమూర్తులను కరివేపాకులా తీసి పారేశాలాగా మాట్లాడాడని ఆయన అనుచరులు చెప్పుకుని ఎంతో బాధపడుతున్నారు.

ఆమధ్య ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్గా రామచంద్రపురంలోని తోట త్రిమూర్తులు ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ణమోహన్ రామచంద్రపురం వెళ్లి మరీ తోట త్రిమూర్తులు ని కలవడం లోని ఆంతర్యం ఏమిటనేది జనాలకు అంతుబట్టలేదు. అలాగే తోట త్రిమూర్తులు కూడా ఆమంచి బాటలో నడిచి తెలుగుదేశం పార్టీని వీడుతారని రూమర్లు కూడా మొదలయ్యాయి. దానిలో భాగంగానే ‘విజయసాయిరెడ్డి’తో ‘విజయవాడ’లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనకు ‘కాకినాడ’ ఎంపీ సీటు..తన కుమారుడికి ‘రామచంద్రాపురం’ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, అలా అయితేనే తాను వైకాపాలోకి వస్తానని షరతు విధించారట. దీనిపై ‘విజయసాయిరెడ్డి’ స్పందిస్తూ…ఒక సీటు మాత్రం ఇస్తామని, రెండోది ఇవ్వడం కష్టమని చెప్పారట. దీనికి..’త్రిమూర్తులు’ స్పందిస్తూ..అలా అయితే.. తాను పార్టీలోకి రానని తెగేసి చెప్పడంతో..’విజయసాయిరెడ్డి’ రెండో సీటు విషయం ‘జగన్‌’తో మాట్లాడుకోవాలని ఫోన్‌ చేసి…త్రిమూర్తులకు ఇచ్చారట.

ఫోన్‌లో జగన్‌ త్రిమూర్తులతో ఆ మాటా..ఈ మాటా…మాట్లాడిన తరువాత..’అన్నా..ఒక సీటు ఇస్తాం. అది నీకా..మీ అబ్బాయికా.. అన్నది మీరే తేల్చుకోండి…రెండో సీటు ఇచ్చే ప్రసక్తే లేదు. అని చెప్పారట. దానికి…’త్రిమూర్తులు’ స్పందిస్తూ బేరం ఆడబోయే ప్రయత్నం చేశారట. రెండు సీట్లు ఇస్తేనే పార్టీలోకి వస్తామని చెప్పడంతో..’జగన్‌’ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారట. నీవేమైనా..పోటుగాడివి అనుకుంటున్నావా…? చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే నీకు. సీటు ఇస్తానని చెబుతున్నా. నీవెంత పోటుగాడివో నాకు తెలుసులే. ఇష్టం అయితే ఒక సీటు తీసుకుని పార్టీలోకి రా..? లేకుంటే మానెయమని చెప్పి ఫోన్‌ పెట్టాశారట. షాక్ తిన్న త్రిమూర్తులు చంద్రబాబుతో సమావేశమై పార్టీలోనే ఉంటానని ప్రకటించి బయటకు వెళ్లిపోయారట. ఇదీ త్రిమూర్తులు పార్టీ మారడంలో జరిగిన అసలైన విషయం…! వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పెద్ద మెంటల్‌ కేసు అని బయట నానా రకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.అతని అహంకారమే అతని పాలిట శత్రువు అని మరోసారి నిరూపణ అయింది. తనకీ టీడీపీలోనే ఉంటే గౌరవం అని తోట త్రిమూర్తులకు తెలిసివచ్చింది.

Copy Protected by Chetan's WP-Copyprotect.