సాగర తీరం..పసుపు హారం విశాఖ సభ ఎక్స్‌క్లూజీవ్ ఫోటోస్

నిప్పులు చిమ్మే సైనికులారా… పదండి ముందుకు . వంచన చేసినవారికి బుద్ధి చెబుదాం.. కుట్ర రాజకీయాలను తరిమికొడదాం..
సింహాద్రి అప్పన్నసాక్షిగా ప్రతినబూనుదాం అంటూ సాగరతీరంలో హోదా హోరు రగిలింది.. అందరి గుండెల్లో ధర్మ పోరాట సంకల్పమే. ప్రతిచోట ‘ప్రత్యేక హోదా’ నినాదమే. పోరుబాట పడదాం పోయేదేముంది.. అంతిమ విజయం ధర్మానిదే.. మెడలు వంచైనా హక్కులు సాధిద్దాం.. తెలుగువాడి సత్తా చాటుదాం… అంటూ జనం ధర్మ పోరాట సభకు మద్దతు పలికారు.

తెల్లదొరల పాలిట సింహస్వప్నం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గర్జించిన నేల ఇది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన పోరాట గడ్డ ఇది.. ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమంలో పరాయి పాలకులను ఎదిరించి నిలదీసింది ఈ విశాఖ.. దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా అని ప్రబోధించిన గురజాడ అడుగుజాడ ఈ నగరం.. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం.. పోదాం. పైపైకి అంటూ మరో ప్రపంచాన్ని మనకు అందించి.. మహా ప్రస్థానానికి నాంది పలికిన శ్రీశ్రీ ఈ ప్రాంతంలోని వాడే. ఇదీ ఈ ప్రాంత విప్లవ చరిత్ర. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ధర్మపోరాటంలో భాగమై కేంద్రంపై పోరాడాలి అంటూ చంద్రబాబు, నేతలు తమ ప్రసంగాల్లో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించగా.. ప్రజలు సైతం నినాదాలతో స్పందించారు. విశాఖ నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగు కళాశాల మైదానంలో నిర్వహించిన తెదేపా ధర్మపోరాట సభకు భారీగా జనం తరలివచ్చారు. విశాఖ సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు భాజపా ఇచ్చిన హామీలు.. కేంద్రంలో అధికారంలోకొచ్చాక మొండిచేయి ఇచ్చిన వైనం.. విపక్షాల కుయుక్తులపై తెదేపా నాయకులు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. దీనికి ఆంధ్రులు బదులు తీర్చాల్సిన వైనాన్ని వివరించారు.

 

Copy Protected by Chetan's WP-Copyprotect.