వైసీపీకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుడ్‌బై!

ఎన్నికల వేళ వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది ప్రకాశం జిల్లాలో. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. లేక జగన్‌కు పంపారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని రెండు రోజులుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి తనయుడు కుందుర్రు నాగార్జునరెడ్డికి వైసీపీ సీటు కేటాయించడంతో అలిగిన జంకె తెలుగుదేశం పార్టీలోకి మారేందుకు ప్రయత్నాలు ప్రారం భించారు.

జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. తనకు మార్కాపురం సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని జంకె వారిని కోరినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రస్తుతం తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తెలుగు దేశంలో పోటీచేసే అవకాశం ఇస్తారా లేక ఎమ్మెల్సీ హామీతో పార్టీలో చేర్చుకుంటారా అన్న విషయం తేలాల్సిఉంది. ఇంకోవైపు జంకె వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈనెల 18న ఆయన నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రకాశం జిల్లాలో విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగులకు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని, అందులో తనకు కచ్చితంగా అవకాశం కల్పిస్తానని గంటాపథంగా చెప్పిన జగన్‌ తనకు కాకుండా నాగార్జున రెడ్డికి సీటు ఇవ్వడంపై ఎమ్మెల్యేతోపాటు ఆయన గ్రూపు కూడా అంతర్మథనంలో పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉంటుందోనని నియోజకవర్గంలో రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ సారి కూడా సీటు తనకేనని భావించిన ఎమ్మెల్యే జంకె పోటీకి ఆ పార్టీ అవకాశం కల్పించలేదు. టికెట్‌ విషయంలో కడదాకా ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో జంకె వెంకటరెడ్డి గ్రూపులో నిరుత్సాహం నిండుకుంది. తన సీటు విషయం అధినేత జగన్‌ వద్దనే తేల్చుకుంటానని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గట్టిగా మాట్లాడిన ఆయనకు భంగపాటు తప్పలేదు. మార్కాపురం నియోజకవర్గ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి పెద్ద కుమారుడు కుందురు నాగార్జునరెడ్డికి అవకాశం కల్పిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. వారు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. మీడియాకు ఆయన దూరంగానే ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆయన అనుయాయులు ఎదురు చూస్తున్నారు. అధికార టిడిపిలో జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన సందర్భంలో మిగిలిన ఎమ్మెల్యేలందరితో ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సమావేశమై… ‘మీరైనా అండగా నిలవాలి… వచ్చే ఎన్నికల్లో మీ స్థానాలు మీకే ఇస్తా’ అని చెప్పారు. ఈ ఒక్క మాటకు కట్టుబడి వచ్చే ఎన్నికల్లో మార్కాపురం సీటు తనదేనని భావించానని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తరచూ చెప్పారు.

తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సీటు ఎంపికలో జంకె వెంకటరెడ్డికి మొండిచేయి చూపడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని నిదర్శనమని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీలు మారే నేతలు.. ఆయా స్థానాల్లో నేతలను మారుస్తుండటంతో.. సిట్టింగ్స్, ఆశావహులు పక్కచూపులు చూస్తున్నారు. అనుచరులతో భేటీ అయ్యి.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక్క వైసీపీలోనే కాకుండా టీడీపీలోనూ టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది.సిట్టింగ్స్ స్థానాలు మార్చటం, కొత్త వారికి అవకాశం ఇస్తుండటంతో.. ఆయా పార్టీల్లో రచ్చ రచ్చ జరుగుతుంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.